English | Telugu

వెంకీ కూడా ల్యాండ్ మార్క్ రీచ్ అవుతున్నాడు..!

ఇప్పటికే ఇద్దరు టాప్ తెలుగు స్టార్స్, చిరంజీవి, బాలకృష్ణలు తమ ల్యాండ్ మార్క్ 150, 100 సినిమాలను మొదలెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరో విక్టరీ వెంటేష్ తన 75 వ సినిమాకు ఈ ఏడాది ముహూర్తం పెట్టే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారన్న దానిపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వినాయక్ లేదా పూరీ జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వినాయక్ వెంకీ కాంబోలో తెరకెక్కిన లక్ష్మి సినిమా మంచి విజయాన్ని సాధించింది. పూరీ జగన్నాథ్ తో ఇప్పటి వరకూ వెంకీ సినిమా రాలేదు. వీళ్లిద్దరిలో ఎవరితో సినిమా ఓకే అయినా, వెంకీ ఫ్యాన్స్ కు శుభవార్తే.

ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న బాబు బంగారం సినిమా విక్టరీకి 73వ నెంబర్. ఆ తర్వాత 74వ సినిమా, నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఫిక్సయ్యింది. ఇప్పటికే బాబు బంగారం దాదాపు పూర్తి కావచ్చింది. మరో రెండు మూడు నెలల్లో కిషోర్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించి, 75వ సినిమాకు కూడా ఈ ఏడాదే ముహూర్తం పెట్టించేస్తున్నాడట వెంకీ. చిరు 150, బాలయ్య 100, వెంకీ 75 అంటూ అగ్రహీరోల సినిమాల ఊపు చూస్తుంటే, బహుశా ఈ ఏడాదిని ల్యాండ్ మార్క్ నామ సంవత్సరం అని పిలవాలేమో..

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.