English | Telugu

మెగాస్టార్ చిరంజీవికి సుప్రీం స్పెషల్ షో..!

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ హీరోగా తెరకెక్కిన సుప్రీం ఈరోజు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి ముందురోజు రాత్రి స్పెషల్ షో వేసింది సుప్రీం టీం. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు మెగా మేనల్లుడు. సినిమా మెగాస్టార్ కు చాలా బాగా నచ్చిందని, మూవీ సక్సెస్ అవ్వాలని తనను తన టీం ను ఆశీర్వదించారని ట్వీటాడు. థాంక్యూ మామా అంటూ చిరంజీవిని మామా అంటూ సంబోధించడం విశేషం.

సాయి ధరమ్ తేజ, రాశి ఖన్నా జంటగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కింది సుప్రీమ్. చాలాకాలంగా తను ఎదురుచూస్తున్న హిట్ ను ఈ సినిమా అందిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నిర్మాత దిల్ రాజు. ఏప్రిల్ 1న రిలీజ్ కావాల్సిన సుప్రీం, ఆ తర్వాత వరస పెద్ద సినిమాలు లైన్ కట్టడంతో ముందుకు జరిగి ఎట్టకేలకు మే 5 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సాయి కార్తీక్ స్వరాలందించాడు. చిరంజీవి సూపర్ హిట్ అందం హిందోళం పాటను ఈ సుప్రీంలో రీమిక్స్ చేయడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.