English | Telugu

రీమిక్స్‌ ‌కింగ్.. సాయి ధరమ్ తేజ్..!

వచ్చి రెండేళ్లు కాలేదు అప్పుడే యమ స్పీడుగా దూసుకెళ్తున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసిన సాయి.. పర్ఫామెన్స్, డ్యాన్స్‌లతో మెగా ఇమేజ్‌ని నిలబెడుతున్నాడు. నేటి తరం హీరోల్లో సాంగ్స్‌ రీమిక్స్ చేయాలంటే సాయి ధరమ్ తర్వాతే. రేయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో మెగాస్టార్ అలనాటి హిట్ సాంగ్స్‌ని రీమిక్స్ చేసి డ్యాన్స్‌ల్లో తన స్టామినా చూపించాడు. దీంతో సక్సెస్‌లు కూడా పరిగెత్తుకుని వస్తున్నాయి. తాజాగా తను నటించిన సుప్రీమ్‌లోనూ మరోసారి చిరంజీవి యముడికి మొగుడు సినిమాలోని అందం హిందోళం సాంగ్‌ను రీమిక్స్ చేశాడు. కొత్త స్టెప్పులు ట్రై చేసి మావయ్య పేరు చెడగొట్టకుండా చిరు ఏ స్టెప్పులైతే వేశాడో మళ్లీ సేమ్ టూ సేమ్ దించేశాడు సాయి. మొత్తానికి మన సుప్రీం చిరంజీవినే వాడతాడో లేక పవన్‌ను కూడా ఫ్యూచర్‌లో ట్రై చేస్తాడామో వేచి చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.