English | Telugu

పాలాభిషేకాలు వద్దంటే బీరాభిషేకం చేస్తారా..?

తమిళనాడులో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరీ ఓవర్ గా ఉంటుంది. ఇక్కడ మనోళ్లు కేవలం కటౌట్ పెట్టి, రిలాక్స్ అయిపోతారు. అంతకు మించి పెద్దగా హడావిడి చేయరు. కానీ తమిళోళ్లు అలా కాదు. గుళ్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం, పూజలు చేయడం లాంటివి చాలా ఫాలో అవుతుంటారు. కొన్ని రోజుల క్రితం పాలాభిషేకాల గురించి మద్రాస్ హైకోర్ట్ కాస్త గట్టిగానే చెప్పడంతో ఫ్యాన్స్ పాల జోలికి వెళ్లలేదు. కోర్టు హమ్మయ్య అనుకునే లోపే, ఫ్యాన్స్ కు మరో వింత ఆలోచన వచ్చింది. బీర్లతోనూ, కూల్ డ్రింక్స్ తోనూ అభిషేకాలు మొదలెట్టారు. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ ఉన్న ఇళయదళపతి విజయ్ నటించిన తేరీ సినిమా నిన్న తమిళనాట రిలీజైంది. ఈ సందర్భంగా విజయ్ ఫ్యాన్స్ ఆయన కటౌట్లకు కూల్ డ్రింక్స్ తో అభిషేకాలు జరిపేశారట. ఇద్దరు ముగ్గురు వీరఫ్యాన్స్ అయితే బీర్ బాటిళ్లతో కటౌట్ కు స్నానం చేయించారట. అభిమానం ఉండచ్చు గానీ, మరీ ఇంతలాగా..వామ్మో..!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.