English | Telugu

టెంప‌ర్ చుట్టూ మ‌రో రూమ‌ర్‌

ఆంధ్ర‌, తెలంగాణ రెండు రాష్ట్ర్రాల్లోనూ టెంప‌ర్ ఫీవ‌ర్ హై పిచ్‌కి చేరింది. మ‌రో వారంలో ఎన్టీఆర్ టెంప‌ర్ ఎంతో చూసేయొచ్చు. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ టెంప‌ర్ పై రూమ‌ర్లు ఎక్కువ‌వుతున్నాయి. ఈ సినిమాని పూరి మ‌రింత షార్ప్ చేసే ఉద్దేశంతో `క‌త్తిరింపులు` తెగ చేసేశాడ‌ని, ఈసినిమాపై న‌మ్మ‌కం లేక బ‌య్య‌ర్లు దూర‌మైతే బండ్ల గ‌ణేష్ సొంతంగానే విడుద‌ల చేస్తున్నాడ‌ని, అత‌నికి పీవీపీ సంస్థ స‌హ‌కారం అందిస్తోంద‌ని గాపిప్పులు విన‌వ‌స్తున్నాయి. టెంప‌ర్ కోసం బండ్ల గ‌ణేష్ ఎడాపెడా అప్పులు చేశాడ‌ని, న‌టీన‌టుల‌కు సాంకేతిక నిపుణుల‌కూ పారితోషికం చెల్లించ‌లేక‌పోయాడ‌ని చెప్పుకొన్నారు. అలాంటిదే మ‌రో గాపిస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రానికి క‌థ అందించిన వ‌క్కంతం వంశీకి చెల్లిస్తాన‌న్న పారితోషికం బండ్ల గ‌ణేష్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఇవ్వ‌లేద‌ట‌. `కోటిస్తా... ` అంటూ మాటిచ్చిన గ‌ణేష్ అడ్వాన్సు చేతిలో పెట్టాడు గానీ, అస‌లు మాట ఎత్తడం లేద‌ని ర‌చ‌యిత కినుక కూడా వ‌హించాడ‌ని టాక్‌. ఈ విష‌యంలో జోక్యం చేసుకోమ‌ని వ‌క్కంతం పూరిని కోరాడ‌ట‌. విడుద‌ల‌కు ముందే ఈ వ్య‌వ‌హారం తేల్చ‌క‌పోతే... తాను ఫిల్మ్‌ఛాంబ‌ర్‌లో ఫిర్యాదు చేస్తాన‌ని వ‌క్కంతం బెదిరిస్తున్నాడ‌ని టాక్‌. మ‌రి అస‌లు నిజం ఏమిటో టెంప‌ర్ టీమ్ కే తెలియాలి.