English | Telugu
పబ్లిసిటీ తుస్సుమంది
Updated : Feb 5, 2015
శుక్రవారం చిన్న చిత్రాల తాకిడితో బాక్సాఫీసు కళకళలాడబోతోంది. గడ్డం గ్యాంగ్, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు, పెసరెట్టు, కొలిమి.. ఇలా శుక్రవారం సినిమా సందడి కాస్త ఎక్కువగానే ఉంది. అయితే.. ప్రేక్షకుల దృష్టి మాత్రం గడ్డం గ్యాంగ్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలపై ఉంది. గడ్డం గ్యాంగ్‌తో హిట్టు కొట్టకపోతే రాజశేఖర్ కెరీర్‌కి ఎండ్‌కార్డ్ పడిపోవడం ఖాయం. అందుకే ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నారు. పబ్లిసిటీ కూడా పక్కగా ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు సినిమాకి మాత్రం ఎక్కడా పబ్లిసిటీ కనిపించడం లేదు. ఈ సినిమాని చాలా సైలెంట్‌గా విడుదల చేస్తున్నారు. అలాగని నిర్మాత అనుభవం లేనివాడా అంటే అదేం లేదు. దశాబ్దాల తరబడి పరిశ్రమలో ఉన్న కె.ఎస్.రామారావు సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. శర్వానంద్, నిత్యామీనన్‌లను తీసుకొచ్చి పబ్లిసిటీ చేయించుకోవచ్చు. కానీ.. వాళ్లెవరూ పబ్లిసిటీకి అంతగా స్పందించడం లేదని తెలిసింది. ఏదో ఓ వీడియో ఇంటర్వ్యూ చేసి మీడియాకు వదిలారు. అంతకు మించి.. మరేం చేయలేమన్నట్టు కె.ఎస్.రవికుమార్ కూడా.. ఈ సినిమాని గాలికొదిలేశారు. ఎందుకో మరి..?