English | Telugu
వర్మ చేసిన ట్వీట్లపై స్పందించిన పవన్
Updated : Mar 19, 2016
సర్దార్ కోసం పెట్టిన ప్రెస్ మీట్లో పవన్ చాలా విషయాలు మాట్లాడారు. తన గురించి, తన సినిమాల గురించి వర్మ చేస్తున్న ట్వీట్ల గురించి విలేకర్లు ప్రస్తావించగా, నేను కూడా విన్నాను. ఆయన ట్వీట్స్ ను అప్పుడప్పుడూ ఫాలో అవుతుంటాను. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కు ఆయనకుంది. దాన్ని నేను గౌరవిస్తాను. ఏ సినిమానో బ్రేక్ చేయాలనో, లేక రికార్డులు క్రియేట్ చేయాలనో నేను సినిమా చేయను. సినిమా బాగుంటే ఎంటర్ టైన్ చేస్తుంది అంతే. దాని కెపాసిటీ బట్టి అది ఆడుతుంది. కష్టపడటం మన చేతిలో ఉంది. ఫలితం భగవంతుండికే వదిలేస్తాను అని స్పందించారు పవన్. మరి పవన్ ప్రెస్ మీట్ గురించి వర్మ మళ్లీ ట్వీటే అవకాశం లేకపోలేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ..