English | Telugu
అవును డేటింగ్ చేశా.. తేల్చి చెప్పిన రేష్మీ..
Updated : Feb 28, 2016
జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ తో ఫుల్ పాపులర్ అయింది రేష్మీ. మామూలుగానే ఈ షోలో కురచ బట్టలతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు రేపే రేష్మీ.. తను తాజాగా నటించిన గుంటూరు టాకీస్ సినిమాలో మరింత రెచ్చి పోయినట్టు కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రోమో సాంగ్ చూస్తేనే అర్ధమవుతోంది. సినిమాలో నటించిన హీరో సిద్దూతో .. ఓ రొమాంటిక్ సాంగ్ లో నటించిన రేష్మీ.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. అందాలు ఆరబోయడంలోనే కాదు. ఫీలింగ్స్ తో కూడా మత్తెక్కించేసింది. అసలు వీరిద్దరి మధ్య గతంలోనే ఏదో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలు.. నిజమే అని చెప్పి ఓ బాంబు పేల్చింది రేష్మీ.. సిద్ధూతో డేటింగ్ చేసిన మాట వాస్తవమేనంటూ చెప్పింది. అయితే అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇదేమీ నిజమైన ప్రేమ డేటింగ్ కాదంట. సినిమా కోసం ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారట. ఈ సాంగ్ కోసం రిహార్సల్ గా ఉండేందుకు.. కాఫీ షాపులు గట్రా కలిసి తిరిగామని కూడా చెప్పింది రష్మీ. మరి నిజంగానే డేటింట్ చేసిందో.. లేదో రేష్మీ కే తెలియాలి.