English | Telugu
కరీనాకి మిడ్ నైట్ కాల్.. సైఫ్ చేతిలో క్లాస్ పీకించుకున్న హీరో
Updated : Feb 27, 2016
బాలీవుడ్లో రోజుకో వార్త చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా కరీనా కపూర్, అర్జున్ కపూర్ పై వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ తాజాగా కీ అండ్ కా అనే చిత్రంలో జోడీగా నటించారు. అయితే ఈసినిమాలో కరీనా మాత్రం రెచ్చిపోయిందట. తనకు పెళ్లయినా కానీ ఎలాంటి మొహమాటం లేకుండా.. కిస్సింగ్ సీన్లలో అదరగెట్టేసిందట. ఇక ఆన్ స్ర్కీన్ లో హీరో అర్జున్ కపూర్.. కరీనా ఎంత క్లోజ్ గా చేశారో ఆఫ్ స్ర్కీన్ లో కూడా అంతే క్లోజ్ గా ఉంటున్నారంట. కరీనా ఆంటీకి అర్జున్ లేట్ నైట్ కాల్స్ చేస్తన్నాడని.. ఒక్కో కాల్ సుదీర్ఘంగా సాగిపోతోందని..వారిద్దరి మధ్య మాటలకు అస్సలు బ్రేక్ ఉండడం లేదని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అలవాటులో అర్జున్ ఫోన్ చేయగా అది కాస్త కరీన్ భర్త సైఫ్ రిసీవ్ చేసుకున్నాడంట. ఇక అంతే సైఫ్ కు చిర్రెత్తుకొచ్చి యంగ్ హీరోకి పెద్ద క్లాసే పీకారంట. దాంతో మన హీరో గారు కరీనాకు మళ్లీ కాల్ చేయాలంటేనే భయపడుతున్నాడంట. మొత్తానికి సైఫ్ బాగానే వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు.