English | Telugu
పాపం శ్రీను వైట్ల.. అన్నిటిలో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందా..!
Updated : Feb 28, 2016
ప్రస్తుతం శ్రీను వైట్లకు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయనే చెప్పొచ్చు. వరుసగా.. ఆగడు.. బ్రూస్లీ సినిమాలు డిజాస్టర్ అవడంతో ఇప్పుడు కొన్ని విషయాల్లో శ్రీనువైట్ల అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందట. ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమా అంటే పెద్ద హీరో.. టాప్ హీరోయిన్.. పెద్ద నిర్మాత ఉండేవారు. కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. పెద్ద సినిమాల నుండి ఒకేసారి మీడియం రేంజి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా.. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఓ మోస్తరు బడ్జెట్లో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ ఆల్రెడీ పూర్తయిపోయిందట. ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం. పాపం రెండు సినిమాలు ప్లాప్ అయ్యేసరికి శ్రీను వైట్లకు ఎంత కష్టం వచ్చిందో.