English | Telugu
వామ్మో రెజీనా.. ముదిరావ్...
Updated : Nov 10, 2014
నిన్నగాక మొన్న మొన్న హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రెజీనా చలాకీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. రెజీనా ఎంత చలాకీదంటే, రెండు మూడు సినిమాల్లో చిన్న హీరోల పక్కన నటించి, ఆ తర్వాత రవితేజ లాంటి బిగ్ స్టార్ పక్కన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మొన్నామధ్య అల్లు అర్జున్‌తో కలసి ఒక యాడ్‌లో కూడా నటించిన రెజీనా వరస చూస్తుంటే ఇక ఈ ముద్దుగుమ్మ వరసబెట్టి టాలీవుడ్‌లో పెద్ద హీరోలందరి సరసన నటించేలా వుంది. మాంఛి దూకుడున్న హీరోయిన్ రెజీనా రేపో ఎల్లుండో టాలీవుడ్ నంబర్ వన్ హీరో సరసన నటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ పండితులు చెబుతున్నారు. ఇదిలా వుంటే రెండ్రోజుల క్రితం పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన రెజీనా చేసిన హాట్ హాట్ కామెంట్లు చూసి టాలీవుడ్ జనం బిత్తరపోతున్నారు. నేను తెరమీద లిప్ టు లిప్ కిస్ ఏనాడో ఇచ్చేశాను.. భవిష్యత్తులో అలాంటి ఆఫర్లు వచ్చినా నో ప్రాబ్లం అని యమా బోల్డుగా చెప్పిన రెజీనాని చూసి బుగ్గలు నొక్కుకుంటున్నారు. రెజీనా ఈ దూకుడుతో వ్యవహరిస్తే అమ్మాయిగారు నంబర్ వన్ హీరోయిన్ స్థానానికి చేరుకోవడానికి ఎంతోకాలం పట్టదని అనుకుంటున్నారు. టాలీవుడ్‌లో ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు.. ఒక్కరైనా రెజీనాలాగా బోల్డ్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారా అంట?! ఏది ఏమైనప్పటికీ... రెజీనా.. నువ్వు ముదిరావ్...!