English | Telugu

నాగ‌చైత‌న్య ఇక ఎవ‌రికీ 'దొర‌క‌డు'



'స్వామి రారా'తో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌. ఇప్పుడు అన్న‌పూర్ణ కాంపౌండ్‌లో అడుగుపెట్టాడు. నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా క్రైమ్ కామెడీ జోన‌రే. కృతి స‌న‌న్ క‌థానాయికగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'దొర‌క‌డు' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇది వ‌ర‌కు 'మాయ‌గాడు' అనుకొన్నారు. కానీ ఆ టైటిల్‌తో ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు సినిమ‌లొచ్చాయి. కాబ‌ట్టి.. దొర‌క‌డు అయితేనే బాగుంటుంద‌ని చిత్ర‌బృందం ఫిక్స‌య్యిందట‌. షూటింగ్ దాదాపుగా పూర్తి కావ‌చ్చింది. ఈనెల 23న నాగ‌చైత‌న్య పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి. జ‌న‌వ‌రిలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.