English | Telugu

రామ్ గోపాల వర్మ కొత్త చిత్రం 'రెడ్డి గారు పోయారు'

రామ్ గోపాల వర్మ కొత్త చిత్రం "రెడ్డి గారు పోయారు" అనే పేరుతో ప్రారంభించబోతున్నాడు. సంచలనాలతో, వివాదాలతో సహవాసం చేసే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ తాను కొత్తగా రాజకీయాల మీద తీయబోయే చిత్రానికి ఒక విభిన్నమైన పేరుని ఎన్నుకొన్నారు. అదే "రెడ్డి గారు పోయారు. అంటే ఏ రెడ్డి గారు పోయారు...? ఆ రెడ్డిగారు ఎక్కడికి పోయారు...? రెడ్డిగారు ఢిల్లీకి పోయారా...? లేకపోతే ఏకంగా పైకే పోయారా...? అన్నది ఇంకా తెలియలేదు.

అయితే ఈ పేరు కూడా రామ్ గోపాల వర్మ ఇంకా కచ్చితంగా అనుకోవటం లేదు. ఈ పేరే గనక వర్మ తన చిత్రానికి పెడితే ఆర్థికంగా, సామాజికంగా బలమైన రెడ్డి సామాజిక వర్గం అతని మీద నిప్పులు చెరగటం ఖాయం. మొన్న రక్తచరిత్ర అని ఫ్యాక్షన్ మీద...ఆ తర్వాత అప్పల్రాజని సినిమా పరిశ్రమలోని కొందరి మీద, మీడియా మీద వ్యంగాస్త్రాలు కురిపించాడు.

బెజవాడ రౌడీలు అని విజయవాడ మీద తన బాణం ఎక్కుపెట్టాడు. ఇప్పుడు రాజకీయాల మీద, అక్కడ చక్రం తిప్పే రెడ్డి సామాజిక వర్గం మీద తన బాణం ఎక్కుపెడుతున్నాడు రామ్ గోపాల వర్మ. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లోని సమకాలీన రాజకీయాల్లో ఉండే కుట్రల వెనకాల ఉండే కుట్రల మీద వర్మ ఎక్కుపెడుతున్న బ్రహ్మాస్త్రం అనుకోవాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం