English | Telugu

రవితేజతో యుటివి సినిమా లేదోచ్

రవితేజతో యుటివి సినిమా లేదోచ్ అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే మాస్ మహరాజా రవితేజ హీరోగా, త్రిష హీరోయిన్ గా, బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన "బ్యాండ్ బాజా బారాత్" సినిమాని తెలుగులో "చిక్ బమ్ చిక్" పేరుతో రీమేక్ చేస్తున్నారని మీడియా నానా గోలచేసింది. అదీ గాక ఈ "చిక్ బమ్ చిక్" చిత్రాన్ని ప్రఖ్యాత సినీనిర్మాణసంస్థ యుటివి నిర్మిస్తుందని బాగా ప్రచారం జరిగింది. కానీ యుటివి సంస్థ ప్రతినిధి ఒకరు "తెలుగులో మేము అలాంటి సినిమా ఏది చేయటం లేదనీ, అసలా సినిమాకూ మాకూ ఎలాంటి సంబంధం లేద"నీ ఘంటాపధంగా నొక్కి వక్కాణించారు.

ఈ విషయాలేమి తెలియని హీరో రవితేజ పాపం తన మానాన తాను తన "వీర" సినిమా షుటింగులో యమ బిజీగా ఉన్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న చిత్రమే "వీర". ఈ చిత్రం తాలూకు షుటింగ్ ఇటీవల మారిషస్ లో జరిగింది. అక్కడ హీరో రవితేజ, హీరోయిన్ తాప్సీలపై రెండు పాటలను, కొన్ని కీలక సన్నివేశాలనూ చిత్రీకరించారు. ఏప్రెల్ 30 వ తేదీన రవితేజ, కాజల్ అగర్వాల్ పై ఈ చిత్రంలోని పాట చిత్రీకరణకు యూరప్ వెళ్తున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...