English | Telugu
హీరో రవితేజ సిక్స్ ప్యాక్
Updated : Mar 4, 2016
మాస్ మహారాజా రవితేజ గత కొద్ది సినిమాలుగా లుక్స్ మారిపోయాయి. తన లుక్స్ పై ఫ్యాన్స్ కూడా హ్యాపీగా లేరు. ఎందుకు రవి ఇలా అయిపోయాడంటూ, అందరూ ఫీలయ్యారు. దానికి కారణం ఇప్పుడు తెలిసింది. రవితేజ సిక్స్ ప్యాక్ బాడీ కోసమే ఇంతకాలం వర్కవుట్లు, డైట్ తో బాడీని కంట్రోల్ లో పెట్టాడు. లేటెస్ట్ గా రవి సిక్స్ ప్యాక్ ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. నలభైల్లో కూడా యూత్ ను ఇన్ స్పైర్ చేసేలా బాడీని తయారుచేసుకున్న రవి పై ప్రశంసలు కురుస్తున్నాయి.
వయసుతో సంబంధం లేకుండా, సిక్స్ ప్యాక్ చేసిన హీరోల లిస్ట్ లోకి ఇప్పుడు మాస్ రాజా కూడా చేరిపోయాడు. త్వరలో రాబోతున్న రాబిన్ హుడ్ సినిమాలో, తన సిక్స్ ప్యాక్ ప్రదర్శించబోతున్నాడని, అందుకే ఇంతలా వర్కవుట్లని వార్తలు వస్తున్నాయి. సినిమా కోసమైనా, క్యాజువల్ గా అయినా, రవితేజ మాత్రం తన పట్టుదలతో, పదిమందికీ ఉదాహరణగా నిలుస్తున్నాడనడంలో సందేహం లేదు.