English | Telugu
విజయ్‌ను మురిపెంగా చూస్తూ మెటికలు విరిచిన రష్మిక!
Updated : Apr 6, 2022
విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్‌గా రష్మికా మందన్న నటిస్తోంది. ముహూర్తపు షాట్ టైమ్‌లో విజయ్ పక్కన నిల్చొని ఆయన వైపు మురిపెంగా చూసిన రష్మిక మెటికలు విరవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కెమెరాలూ అందుకు మినహాయింపు కాదు. అప్పుడే విజయ్ తన భుజం మీద చేయివేస్తే ఆ చేతికి తల ఆనించి, తన ముఖాన్ని రెండు చేతుల మధ్య పెట్టుకొని నవ్వులు చిందించింది రష్మిక. ఈ మూమెంట్స్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది రష్మిక. "సంవత్సరాల తరబడి నుంచీ సార్‌ను చూస్తూ వస్తున్నాను. ఇప్పుడు నేను చేయాలనుకున్నదంతా చేయబోతున్నా. ఆయనతో నటించనుండటం, డాన్స్ చేయబోతుండటం, ఆయనతో మాట్లాడటం.. ప్రతిదీ.. ఎట్టకేలకు! ఒక సంపూర్ణ ఆనందం... కొత్త బిగినింగ్స్‌కు చీర్స్" అంటూ రాసుకొచ్చింది.
కెరీర్‌లో రష్మిక ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. తెలుగులో ఇప్పటికే అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2', దుల్కర్ సల్మాన్ సరసన స్వప్న సినిమా నిర్మిస్తోన్న చిత్రం, హిందీలో అమితాబ్‌తో 'గుడ్‌బై', రణబీర్ కపూర్‌తో 'యానిమల్' సినిమాలో ఆమె నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించిన 'మిషన్ మజ్ను' మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.