English | Telugu

ప్రభాస్ పెళ్లిపై 'నగ్నం' బ్యూటీ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. అప్పుడెప్పుడో 'బాహుబలి'కి ముందు ప్రభాస్ పెళ్లి అన్నారు. బాహుబలి-1 వచ్చింది, బాహుబలి-2 వచ్చింది. ఆ తర్వాత నాలుగైదు ఏళ్లు గడిచిపోయాయి. అయినా ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ లేదు. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పలు సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్ చేసిన శ్రీరాపాక ఆర్జీవీ తెరకెక్కించిన 'నగ్నం' మూవీలో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఇటీవల బిగ్ బాస్ ఓటీటీలోనూ సందడి చేసింది. హౌస్ లో అడుగుపెట్టిన రెండు వారాలకే ఎలిమినేట్ అయిన ఈ భామ.. ఆ తర్వాత వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిని ప్రభాస్ పెళ్ళితో ముడి పెడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్‌ మొదటి మూవీ 'ఈశ్వర్‌' అంటే చాలా ఇష్టమని, అప్పటి నుంచి ప్రభాస్‌ అంటే క్రష్‌ అని శ్రీరాపాక చెప్పింది. మరి ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటారా? అని అడగ్గా.. అంతకంటే అదృష్టమా! ప్రభాస్ ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు జీవించినా చాలు అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. అయితే అది ఎలాగు జరగదు కాబట్టి ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంత వరకు వెయిట్‌ చేస్తానని, ఆయన పెళ్లి తర్వాతే తాను పెళ్లి పీటలు ఎక్కుతానని శ్రీరాపాక చెప్పుకొచ్చింది. ఒకవేళ ప్రభాస్‌ పెళ్లి చేసుకోకపోతే.. తాను కూడా ఎప్పటికీ చేసుకోనని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.