English | Telugu

బియ్యపు గింజలపై పేరు... అందుకే హీరోయిన్‌గా మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి!!

ఛలో’తో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఒక్కో సినిమాను ఆచి తూచి సెలక్ట్‌ చేసుకుంటూ తన కెరీర్‌ని బిల్డ్‌ చేసుకుంటోంది. దీంతో ఆమెకు అన్నీ మంచి ఆఫర్సే వస్తున్నాయి. స్టార్‌ హీరోలందరూ రష్మికతో యాక్ట్‌ చెయ్యాలని కోరుకుంటున్నారు. ఆమధ్య రష్మిక చేసిన తమిళ్‌, హిందీ సినిమాలు ఆమెను కొంత నిరాశ పరిచినప్పటికీ ఆఫర్స్‌ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆమె నటించిన హిందీ సినిమా ‘యానిమల్‌’పైనే అందరి దృష్టీ ఉంది. ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌ వంగా డైరెక్షన్‌లో రూపొందిన ‘యానిమల్‌’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్‌ 1న ఈ సినిమా పలు భాషల్లో విడుదల కాబోతోంది.

ఇటీవల రష్మిక మందన్న ఒక చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాకు ఈమధ్య అన్నీ మంచి ఆఫర్సే వస్తున్నాయి. అయితే దానికి కారణం ఏమిటని అందరూ అడుగుతున్నారు. ఎవరికి ఏ క్యారెక్టర్‌ చెయ్యాలని రాసిపెట్టి ఉంటే అదే వస్తుంది. అంతేకాదు, ప్రతి మనిషికి మంచి టైమ్‌ అంటూ ఒకటి వస్తుంది. ప్రస్తుతం నాకు గుడ్‌ టైమ్‌ నడుస్తోంది. అందుకే మంచి మంచి ఆఫర్స్‌ వస్తున్నాయని నా నమ్మకం. ఇంతటితో అయిపోలేదు. ఇంకా నేను చెయ్యాల్సిన క్యారెక్టర్స్‌ చాలా ఉన్నాయి. విభిన్నమైన క్యారెక్టర్స్‌ చేసి అందర్నీ అలరించాలన్నదే నా కోరిక’’ అన్నారు.