English | Telugu
అల్లు అర్జున్ తో రాశీ గుసగుసలు..!
Updated : Sep 8, 2014
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ లవ్ స్టొరీని డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు హీరోయిన్లతో బన్నీ రొమాన్స్ చేయనున్నాడు. ఇప్పటికే సమంతను లీడ్ హీరోయిన్ గా ఆదాశర్మ ను మరో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక మూడో కథానాయిక పాత్ర కోసం ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఆకట్టుకొన్న కథానాయిక రాశీఖన్నా ను తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ప్రణీత ను ఈ పాత్ర కోసం తీసుకోగా ఆఖరి నిమిషంలో త్రివిక్రమ్ రాశీఖన్నాను ఓకే చేసినట్లు సమాచారం. ఊహలు గుసగుసలాడే చిత్రంలో తన క్యూట్ లుక్స్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మైతే బన్నీ సరసన బాగుటుందని భావించారట.