English | Telugu

శంకర్ బ్రాండ్ కి 30కోట్లు..!

సంచలనాలకు కేరాఫ్ అయిన తమిళ దర్శకుడు 'శంకర్' ప్రస్తుతం విక్రమ్ తో కలిసి 'ఐ' అనే భారీ బడ్జెట్ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు హక్కులకు భారీ మొత్తం ఆశీ౦చడంతో తీసుకోవడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రావడంలేదని గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా తెలుగు హక్కులు కావాలంటే ముప్పయ్‌ కోట్లు చెల్లించాల్సిందేనని లేకపోతే తానే విడుదల చేసుకుంటానని ఆస్కార్‌ రవిచంద్రన్‌ డిసైడ్ కూడా అయ్యారు. అయితే తాజాగా 'ఐ' మనోహరుడు’ హక్కులకి ముప్పయ్‌ కోట్లు ఇవ్వడానికి మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. హీరో విక్రమ్ కి తెలుగులో అంత మార్కెట్ లేకపోయినా, ఈ సినిమాకి ముప్పయ్‌ కోట్లు చెల్లించారంటే కారణం కేవలం శంకర్ అని వేరే చెప్పక్కర్లేదు. ఇక సెప్టెంబర్ 15న ‘ఐ’ ఆడియో, అక్టోబర్ 22న సినిమా రిలీజ్ కాబోతున్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.