English | Telugu
రానాకి 'బాహుబలి' వేసవి సెలవులు
Updated : May 6, 2014
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'బాహుబలి' సినిమాలో రానా చేస్తున్న పాత్ర కీలకసన్నివేశాల షూటింగ్ పూర్తయింది. దీంతో ఆయనకి రాజమౌళి వేసవి సెలవులు ప్రకటించారట. ఆయన నటించే మరో షెడ్యూల్ మొదలయ్యే నాటికి కొన్ని నెలల సమయం పట్టనుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రానా ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. త్వరలో తాను నటించే మరో సినిమా షూటింగ్ కూడా మొదలుకానున్నట్లు తెలిపారు. టాలీవుడ్ చరిత్రలో 100 కోట్ల పైగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో గత కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ జానపద చిత్రంలో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్నారు. రానా నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. అడవి శేష్, రానా కుమారుడి పాత్రలో కనిపించబోతున్నాడు.