English | Telugu

రానా జెనీలియా మూవీ పేరు "నా ఇష్టం"

రానా హీరోయిన్ గా, జెనీలియా హీరోయిన్ గా నటించబోయే మూవీకి "నా ఇష్టం" అన్న పేరుని నిర్ణయించారట. ఇటీవల ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ స్వీయ రచనకు "నా ఇష్టం" అన్న పేరుని పెట్టారు. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, యువ హీరో దగ్గుపాటి రానా హీరోగా, హాసిని పాప జెనీలియా హీరోయిన్ గా, ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో, యువ డైనమిక్ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రానికి "నా ఇష్టం" అన్న పేరుని నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం.

ఈ రానా హీరోయిన్ గా, జెనీలియా హీరోయిన్ గా నటించబోయే మూవీ "నా ఇష్టం" చిత్రం ఏప్రెల్ 9 వ తేదీన, హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్ లో సినీ పెద్దల సమక్షంలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఈ చిత్ర నిర్మాత గతంలో యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నిర్మించిన "సింహా" చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం కూడా ఆ రేంజ్ హిట్టవుతుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.