English | Telugu
గురువారం రామానాయుడు అంత్యక్రియలు
Updated : Feb 18, 2015
దగ్గుబాటి రామానాయుడు అంత్యక్రియలు గురువారం మద్యాహ్నం మూడు గంటల తర్వాత జరుగుతాయని ఆయన కుమారుడు, ప్రముఖ హీరో వెంకటేష్ చెప్పారు. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రామానాయుడు స్టూడియోస్ వద్ద ఆయన బౌతిక కాయాన్ని ఉంచుతామని, అభిమానులు అక్కడ సందర్శించి నివాళి అర్పించవచ్చని ఆయన అన్నారు. కాగా రామానాయుడు మరణంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచానికి తీరనిలోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ నిర్మాత రామానాయుడి మృతి సినీ పరిశ్రమకు తరని లోటని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రామానాయుడు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.