English | Telugu
దగ్గుబాటి రామానాయుడు కన్నుమూత
Updated : Feb 18, 2015
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ సోకింది. దానికి ఆయన అప్పట్లో చికిత్స తీసుకుని ఆ వ్యాధి మీద గెలిచారు. అయితే వయసు పెరిగిపోవడంతోపాటు ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు బయటపడటంతో ఆయన మళ్ళీ చికిత్స పొందుతూ బుధవారం నాడు కన్నుమూశారు.