English | Telugu
మధురిమ.. రెండోస్సారి
Updated : Feb 7, 2015
ఐటెమ్‌కి ఎప్పుడు కొరత వచ్చినా 'మాజీ' హీరోయిన్స్ చేత ఊర మాస్ గీతాలకు స్టెప్పులు వేయించడం అలవాటు చేసుకొన్నారు మన దర్శకులు. తాజాగా వారి కన్ను మధురిమపై పడింది. వంశీ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొన్న మధురిమ ఆటలు ఎంతో కాలం సాగలేదు. అరడజను సినిమాలతోనే 'సైడ్' అయిపోయింది. `కొత్త జంట`తో ఐటెమ్ గాళ్‌గా మారింది. 'టెంపర్'లో ఓ పాత్రలో కనిపించబోతోంది. ఇప్పుడు తన కెరీర్‌లో రెండోస్సారి ఐటెమ్ పాట చేయబోతోంది. నాగచైతన్య - సుధీర్‌వర్మ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. షూటింగ్ చివరి దశకు చేరుకొంది. కథలో ఓ ఐటెమ్ సాంగ్ ఉందట. ఈ పాట మధురిమతో చేయించాలని చిత్రబృందం ఫిక్సయ్యింది. హీరోయిన్‌గా ఎలాగూ ఛాన్సులు రావడం లేదు. కనీసం ఇలాగైనా బండి లాగిస్తుందేమో చూడాలి.