English | Telugu
కుమారిను తప్పించేశారట పాపం..!
Updated : May 7, 2016
వరుణ్ తేజ్, శ్రీను వైట్ల సినిమా జూన్ 1 నుంచి మొదలవనున్న సంగతి తెలిసిందే. సినిమాలో వరుణ్ సరసన లావణ్య త్రిపాఠీ, హెబ్బాపటేల్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. మొదట వరుణ్ అండ్ కాజల్ అని అనుకున్నారు. కానీ వయసులో కాజల్ పెద్దగా కనిపించిందో ఏమో కానీ, ఆమెను తప్పించి ఆమె స్థానంలో లావణ్యను తీసుకున్నారు. ఇక హెబ్బా పటేల్ కూడా ఈ కాలేజ్ లవ్ స్టోరీలో బబ్లీగా ఉండే క్యారెక్టర్ చేస్తుందని అందరూ గెస్ చేశారు. అయితే ఫిల్మ్ నగర్లోని గుసగుసల ప్రకారం, సినిమా నుంచి కుమారిని తప్పించే ఆలోచన చేస్తున్నారట. అసలు కారణం తెలియకపోయినా, మూవీ యూనిట్ మాత్రం, వరుణ్ మరీ హైట్ అయితే, హెబ్బా మరీ పొట్టి గా ఉంది. అందుకే కాస్త హైట్ గా ఉన్న అమ్మాయైతే బెస్ట్ అనుకుంటున్నాం అని చెబుతున్నారట. కుమారి21కు ఈ ఆఫర్ చాలా అవసరం అని చెప్పాలి. సినిమా హిట్టైతే ఈ ముద్దుగుమ్మ కెరీర్ స్పీడ్ అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ లాస్ట్ మినిట్ ఛేంజ్ ఎందుకొచ్చిందో గానీ, ఈ పాప మంచి ఛాన్స్ కోల్పోయినట్టే. ప్రస్తుతం కాస్త ఖాళీగానే ఉన్న మెగా హీరోయిన్ రెజీనాను ఈ అవకాశం వరించినట్టు సమాచారం. రెజీనా ఆఫర్ వెనుక ఎవరి హస్తం ఉంది చెప్మా...!