English | Telugu

‘వంగవీటి’ రహస్యాలు


ఎప్పుడూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'వంగవీటి' అనే వివాదాస్పద సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో డిజైన్ రిలీజ్ చేసాడు. రక్త వర్ణంతో కత్తులు, సైకిల్ చైన్ తో ఈ లోగో ఉండటం బట్టి చూస్తే సినిమాలో కావాల్సినంత వయెలెన్స్(హింస) ఉంటుందని స్పష్టమవుతోంది.

ఈ చిత్రం గురించి వర్మ మాట్లాడుతూ.... ‘వంగవీటి’కి సంబంధించిన కొన్ని రహస్యమైన విషయాలు తెలుసుకోవడానికి నేను విజయవాడ వెళుతున్న సందర్భంలో నా ఆనాటి జ్ఞాప‌కాలనుంచి నాకిప్పుడనిపిస్తుంటుంది. విజయవాడ నా తల్లి, నా తండ్రి, నా గురువు, నా దైవమని...ఎందుకంటే గతంలో నేను చాలా సార్లు చెప్పినట్లు నేనిది నేర్చుకున్నా అది విజయవాడనుంచే. ‘వంగవీటి’కి సంబంధించి ఆ సబ్జెక్ట్ మీదున్న మమకారంతో ఇప్పుడు వంగవీటి టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాను. సిరాశ్రీ పాటను రాయగా సుశర్ల రాజశేఖర్ సంగీతం అందించాడు అని అన్నారు.

ఇక ఈ సినిమా మొత్తం విజయవాడ రౌడీయిజం చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు విజయవాడలో మాస్ లీడర్‌గా తన ఆధిపత్యం కొనసాగించిన వంగవీటి రంగా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయవాడలో రెండు అగ్రవర్ణం కులాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు ఎలాంటి పరిణామాలకు దారిసిందనే అంశాలను ఈ సినిమాలో వర్మ చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.