English | Telugu
దిల్ రాజుకు పవన్ తో కుదిరిందా..?
Updated : Feb 25, 2016
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్నది తన జీవిత ధ్యేయమంటూ ఎప్పుడో ప్రకటించారు దిల్ రాజు. పవన్ ఊ అంటే అద్భుతమైన కథలున్నాయని చాలా సార్లు చెప్పారు. తాజా సమాచారం ప్రకారం, దిల్ రాజుతో సినిమాకు పవన్ సై అన్నాడట. కథ ఉంటే వినిపించమని పవన్ రాజు కు చెప్పారని సమాచారం. కానీ బడ్జెట్ ఎక్కువ పెట్టే విషయంలో మాత్రం ఆలోచిస్తానంటున్నారు రాజు. 50 కోట్లు మించి బడ్జెట్ పెట్టనని, సినిమాలకు ఖర్చు ఎక్కువ అయ్యేది ప్లానింగ్ లోపం వల్లే కాబట్టి, అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకునే సెట్స్ పైకి వెళ్తానంటున్నాడు దిల్ రాజు. పవన్ తో ఎలాంటి సినిమా చేస్తే అభిమానులు ఆనందిస్తారో అలాంటి స్క్రిప్ట్ పై ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. త్వరలోనే ఫైనల్ స్టోరీ పవన్ కు వినిపిస్తాను. ఆయన కూడా ఓకే అంటే సినిమా రెడీ అంటున్నాడు. మరి వీళ్లిద్దరి కాంబో సినిమా ఎప్పుడు తెరకెక్కబోతోందో వేచి చూడాలి.