English | Telugu
మహేష్ 'శ్రీమంతుడు'కి కోర్టు నోటీసులు?
Updated : Feb 26, 2016
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో గ్రామాలను దత్తత తీసుకోవాలనే కాన్సెప్టుతో రూపొందిన 'శ్రీమంతుడు' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచనాలు క్రియేట్ చేసిన సంగతి మీకు తెలిసిందే.... అంతే కాకుండా ఈ చిత్రం రిలీజైన తర్వాత మహేష్ బాబు తన స్వగ్రామం బుర్రిపాలెంతో పాటు మరో గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. కాగా 'శ్రీమంతుడు' సినిమా విడుదలైన వెంటనే ఓ వివాదం తెరపైకి వచ్చింది.
ఆ వివాదం ఏమిటంటే... జర్నలిస్ట్‌గా శరత్ చంద్ర 2012 లో స్వాతి అనే ప్రముఖ వారపత్రిక లో 'చచ్చేంత ప్రేమ' అనే పేరుతో ఓ సీరియల్ రాసానని.. అదే కథ ని శ్రీమంతుడు గా తీసారని అప్పట్లో ఆరోపించారు. తాజాగా ఈ ఇష్యూపై సదరు శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు నవీన్ యర్నేని, రవి శంకర్, సివి మోమన్ లతో పాటు...ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ లో నటించబోతున్న హృతిక్ రోషన్‌కు నోటీసులు అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.