English | Telugu

నాకు నేనే పోటీ అంటున్న రకుల్..!

వరస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డం ను ఎంజాయ్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. రేపు రిలీజ్ కాబోతున్న సరైనోడు ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రకుల్ తో, తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు మీకోసం...

సరైనోడు ఒక కమర్షియల్ యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్. మొత్తం మాస్ అనే కాక ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చే మూవీ అవుతుంది.

రాజమండ్రిలో ఉండే ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషిస్తున్నాను. స్లాంగ్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి డబ్బింగ్ చెప్పలేదు.

సినిమా ఫస్ట్ కాపీ చూడను. డైరెక్ట్ గా రిలీజ్ రోజున హాల్లో చూసి ఎంజాయ్ చేస్తాను.

అల్లు అర్జున్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్. సినిమా కొత్తగా రావాలని, తెలుగువారి గురించి ప్రపంచమంతా మాట్లాడుకోవాలి అని బన్నీ భావిస్తారు.

సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా నా కష్టంలో మార్పు ఉండదు. అందుకే ఫలితాన్ని నా మీద ప్రభావాన్ని చూపించనివ్వను. విజయం అయినా, పరాజయం అయినా నా ఒక్కదాని వల్లే కాదు కదా..

మేకప్ ఇష్టం ఉండదు. వీలైనంత వరకూ మేకప్ లేకుండా ఉండటానికే ఇష్టపడతాను. తప్పదు అనుకున్నప్పుడు మాత్రం మినిమల్ మేకప్ వేసుకుంటాను.

నాకు ఎవరో ఇల్లు గిఫ్ట్ ఇచ్చారంటూ పుకార్లు వస్తున్నాయి. అవన్నీ ట్రాష్. ఒకవేళ నిజంగా ఎవరన్నా ఇస్తానన్నా నేనే తీసుకోను. నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను. ఇలాంటి పుకార్లు చాలా ఇబ్బంది పెడతాయి. మా నాన్నకు చాలా కోపం వచ్చింది. కానీ ఇవి కామన్ అని నేనే సర్దిచెప్పాను. ఒక అమ్మాయికి ఇలాంటి పుకార్లు చాలా బాధ కలిగిస్తాయి.

తెలుగు ప్రేక్షకులు నాకు చాలా మంచి స్థానాన్నిచ్చారు. వాళ్లకు చాలా రుణపడి ఉంటాను. ఇలాగే హార్డ్ వర్క్ చేస్తాను. డిఫరెంట్ రోల్స్ తో వాళ్లకు బోర్ కొట్టించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను.

నాకు ఇండస్ట్రీలో ఎవరూ పోటీ కాదు. ఇక్కడ ఎవరి అవకాశాలు వారికే ఉంటాయి. పైగా నేను సమంత, తమన్నా లాంటి వాళ్లందరికంటే అనుభవంలో చాలా చిన్నదాన్ని. సో వాళ్లందరూ నాకంటే హైస్టేజ్ లోనే ఉంటారు. ఇంక వాళ్లకు నేను పోటీ ఎందుకవుతాను. నన్ను నాకు పోటీగా భావిస్తాను.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.