English | Telugu

పండూరులో కింగ్ నాగార్జున సందడి..!

కింగ్ నాగార్జున వరస విజయాలతో నటుడిగా, నిర్మాతగా ఊపుమీదున్నారు. తాజాగా మరో సారి నిర్మాతగా శ్రీకాంత్ తనయుడితో నిర్మలా కాన్వెంట్ ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. సోగ్గాడే చిన్ని నాయనా హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో పాల్గొన్నట్టు నాగ్ కనిపిస్తారట. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ స్టోరీ సక్సెస్ కావడం వెనుక ఆయన పాత్ర కూడా ఉంటుందట. ఈ షూటింగ్ నిమిత్తం నాగార్జున తూర్పుగోదావరిలోని పండూరుకు చేరుకున్నారు. ఇక్కడ నాగార్జునతో సోగ్గాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వీటితో పాటు, గ్రామంలో మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. నాగార్జున వచ్చారని తెలిసి సమీప గ్రామాల ప్రజలు పండూరుకు చేరుకున్నారు. వైసీపీ నాయకుడు కురసాల కన్నబాబు నాగార్జునను రిసీవ్ చేసుకున్నారు. కాగా, త్వరలోనే రాఘవేంద్రరావుతో హాథీరాం బాబా కథను తెరకెక్కించబోతున్నారు కింగ్ నాగార్జున. ఆయన నిర్మిస్తున్న నిర్మలా కాన్వెంట్ లో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.