English | Telugu

హీరో నితిన్, త్రివిక్రమ్ లకు షాక్ ఇచ్చిన పవన్..!

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. స్నేహితులే కాక, ఇద్దరీ అభిప్రాయాలు, భావాలు కూడా ఒకేలా ఉంటాయి. అందుకే పవన్ త్రివిక్రమ్ కు అప్పుడప్పుడూ సడెన్ సర్ ప్రైజ్ ఇస్తుంటారు. తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్లో నితిన్ హీరోగా అ..ఆ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చివరిదశకు చేరుకున్న ఈ సినిమా సెట్స్ లో ఒక్కసారిగా పవన్ ప్రత్యక్షమై, మూవీ యూనిట్ కు స్వీట్ షాక్ ఇచ్చారు. విచిత్రంగా, నితిన్ యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా పవన్ అక్కడే కూర్చుని చూశారట. తను భీభత్సంగా అభిమానించే పవన్ ముందు నటించాలంటే, కాస్త నెర్వస్ గా, ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించిందని నితిన్ ట్వీట్ చేశాడు. నితిన్ అన్నా, త్రివిక్రమ్ అన్నా పవన్ కు చాలా అభిమానం. అందుకే వాళ్లిద్దరు కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ చూడటానికి సెట్స్ కు వచ్చాడట పవన్. సర్దార్ రిలీజ్ కు ముందు గుర్రంపై ఊగుతూ, నితిన్ సమంతలు ఇద్దరూ పవన్ కు విష్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ప్రతీ ఏడాదీ తన తోటలో పండే మామిడి పళ్లను నితిన్ కు పంపిస్తుంటాడు పవన్. వాటిని నితిన్ ట్విట్లర్లో షేర్ చేస్తుంటాడు. ఈ సారి వేసవికి డైరెక్ట్ గా పవనే తన సెట్లోకి వచ్చేయడంతో, నితిన్ ఆనందానికి హద్దుల్లేవు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.