English | Telugu
చరణ్ కోసం బికినీ వేస్తుందట
Updated : Feb 17, 2015
ఈమధ్య తెలుగునాట.. మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొంది రకుల్ ప్రీత్ సింగ్..! వరుస విజయాలు, బడా హీరోలతో ఛాన్సులతో రకుల్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు రామ్‌చరణ్ తో జోడీ కట్టింది. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంతని కాదని, రకుల్‌ని కథానాయికగా ఎంచుకొన్నారు. రకుల్ అయితే మరింత హాట్ గా కనిపిస్తుందని టీమ్ భావిస్తోందట. చిత్రబృందం ఆశలకు అనుగుణంగా తనని తాను తెరపై ఆవిష్కరించుకోవడానికి కూడా రకుల్ సిద్ధంగా ఉంది. అన్నట్టు ఈసినిమాలో రకుల్ బికినీలో కనిపించనున్నదని సమాచారం. ఇది వరకు బాలీవుడ్ సినిమాలో లిప్‌లాక్ లతో వేడెక్కించి, బికినీలో హాట్ పోజులిచ్చింది రకుల్. తెలుగు నాట మాత్రం అంత హాట్‌గా ఆమెను ఎవ్వరూ చూపించలేదు. ఆ అవకాశం చరణ్ సినిమాతో కలుగనుంది. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో రకుల్ బినికీలో మత్తెక్కించనున్నదని టాలీవుడ్ టాక్. చరణ్ సినిమా అంటే అన్ని కళ్లూ చరణ్‌వైపే ఉంటాయి. డాన్సులు ఎలా చేస్తాడు? ఎలాంటి డైలాగులు చెప్తాడు? అంటూ ఎదురుచూస్తారు. ఇప్పుడు రకుల్... తన బినికీ కోసం కూడా ఎదురుచూసేలా చేయబోతోందన్నమాట.