English | Telugu
జస్ట్ గ్రాఫిక్స్ కే అంత భారీ ఖర్చు..!
Updated : May 12, 2016
డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే నిర్మాత ఒక రెండు మూడొందల కోట్లు దగ్గర పెట్టుకోవాలి. సినిమా సినిమాకూ తన బడ్జెట్ ను పెంచుకుంటూ వెళ్లిపోతున్నాడు శంకర్. రోబో సినిమా టైం లో, ఇంత బడ్జెట్టా అని పెద్ద పెద్ద స్టార్స్ కూడా భయపడ్డారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవడంతో, శంకర్ సేఫ్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన విక్రమ్ ' ఐ ' బాగా దెబ్బకొట్టేసింది. ఇక నుంచి బడ్జెట్ కు పరిమితులు పెట్టుకుంటాడులే అని అందరూ భావించారు. కానీ శంకర్ కు మాత్రం అలాంటి ఆలోచనలేమీ లేవు. రోబో 2 కోసం ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించేశారట. సింపుల్ గా చెప్పాలంటే, ది బిగ్గెస్ట్ ఇండియన్ మోషన్ పిక్చర్ అన్న ట్యాగ్ ను బాహుబలి నుంచి రోబో 2 తీసేసుకోబోతోంది. ఈ 300 కోట్ల బడ్జెట్ లో వంద కోట్లు కేవలం గ్రాఫిక్స్ కే పెడుతున్నాడట శంకర్. గ్రాఫిక్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని రోబో కంటే సీక్వెల్ లో మరింత ఎక్స్ ట్రార్డినరీ గ్రాఫిక్స్ కావాలని శంకర్ ఆలోచన. సినిమాలో సగం పైగా గ్రాఫిక్సే ఉంటాయని మూవీ సభ్యులు చెబుతున్నారు. అయినా ఇంత ఖర్చు వెనక్కి రాబట్టుకోవడం సాధ్యమేనా..ఎంటో శంకర్ కాన్ఫిడెన్స్..!