English | Telugu
అల్లు అర్జున్ కేరళపై దాడికి రెడీ..!
Updated : May 12, 2016
మన హీరోలు తెలుగు కాకుండా మరో భాషలో ఫ్యాన్స్ ను సంపాదించుకున్న దాఖలాలు చాలా తక్కువ. అల్లు అర్జున్ మాత్రం ఆ హీరోల్లో మినహాయింపు. తెలుగులో ఎంత మార్కెట్ ఉందో, అంతే రేంజ్ ను మళయాళంలో కూడా క్రియేట్ చేసుకున్నాడు బన్నీ. అక్కడి స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ తో సమానంగా బన్నీకి స్టార్ స్టేటస్ ఉందంటే అర్ధం చేసుకోవచ్చు అక్కడ అతని రేంజ్. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా వందకోట్ల గ్రాస్ సాధించేసిన సరైనోడును కూడా ఈ నెల 27న కేరళ రాష్ట్ర వ్యాప్తంగా డబ్ చేసి ' యోధావు ' గా రిలీజ్ చేస్తున్నారు. అక్కడి అల్లు అర్జున్ అభిమానులు కూడా సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ విషయాన్ని తన ఫేస్ బుక్ లో అఫీషియల్ గా బన్నీ ప్రకటించాడు. ఇప్పటికే 60 కోట్ల షేర్ ను దాటేసిన సరైనోడు, యోధావుగా ఎంత కలెక్ట్ చేస్తాడో చూడాలి మరి.