English | Telugu

మెగా నిర్మాతకు షాకిచ్చిన రజనీకాంత్‌

రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘లింగా’ సినిమా తెలుగు వెర్షన్‌ ఆడియో విడుదల వేడుక హైద్రాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా నిర్మాత అల్లు అరవింద్ కి వూహించని షాక్ తగిలింది. ఇంతకి అసలు ఏం జరిగిందంటే, ఆడియో కార్యక్రమంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ 'రజినీకాంత్ తో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఆయన ఒప్పుకుంటే నెక్స్ట్ సినిమా తీయాలనుకుంటున్నానని' అన్నారు. దీనికి సమాధానంగా రజనీకాంత్‌ చేసిన కామెంట్ కి అల్లు అరవింద్‌ ఒకింత షాక్‌కి గురవ్వాల్సి వచ్చింది. 'నా నెక్స్ట్ మూవీ గురించి అల్లు అరవింద్ అడుగుతున్నారు. కథ దొరకాలి కదా. ముందు మీ చిరంజీవిగారి సంగతి చూడండి. పాపం ఆయన 150వ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు'' అని అనేశారు. దీంతో ఆడియోకి వచ్చిన పెద్దలంతా ఒక్కసారిగా నవ్వేశారు. సూపర్ స్టార్ ఇచ్చిన సమాధానానికి అవాక్కయిన అరవింద్..తాను కూడా ఓ చిరునవ్వు చిందించారు. మరి సూపర్ స్టార్ ఆడియోలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వుండాలి కదా, లేకపొతే ఇలాంటి షాక్ లే తగులుతాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.