English | Telugu

నటకిరీటి... లేటెస్ట్ కిరికిరి...

'మా' అధ్య‌క్ష‌పీఠం ఎక్కి ఇంకా రెండ్రోజులు కాలేదు.. అప్పుడే - న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌పై నిరస‌న జ్వాల‌లు మొద‌లైపోయాయి. రాజేంద్ర ప్ర‌సాద్ హుందాగా ప్ర‌వ‌ర్తించ‌డం లేద‌ని, ఆయ‌న ఒంటెద్దుపోక‌డ 'మా' కి తీవ్ర‌మైన న‌ష్టం క‌లిగించే ప్ర‌మాదం ఉంద‌ని కొంత‌మంది 'మా' స‌భ్యులు, ప్యాన‌ల్ మెంబ‌ర్లు ఆవేద‌న చెందుతున్నారు. ఇటీవ‌ల రాజేంద్ర‌ప్ర‌సాద్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని క‌లిసిన విష‌యం విదిత‌మే. 'మా' అధ్య‌క్షుడిగా ముఖ్య‌మంత్రిని క‌లుసుకొన్న రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. దాన్నో ప‌ర్స‌న‌ల్ విజిట్‌గా తీసుకొన్నార‌ని, 'మా' ప్యానల్ అంటే మిగిలిన 22మందీ అని, కేవలం ఆయ‌న ప్యాన‌ల్‌లోని న‌లుగురిని మాత్ర‌మే వెంట వేసుకొని తిరుగుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు కొంత‌మంది సీనియ‌ర్ న‌టీన‌టులు. చిరంజీవిని క‌లుసుకొని ఆయ‌న ఆశీర్వాదం తీసుకోవ‌డాన్ని కూడా త‌ప్పుప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ప‌రిశ్ర‌మ‌లో చిరంజీవి సీనియ‌ర్ న‌టుడే కానీ.. బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ సీనియ‌ర్లు కాదా, ప‌రిశ్ర‌మ‌కు పెద్ద‌దిక్కు అయిన దాస‌రి నారాయ‌ణ‌రావు అంటే ఖాత‌రు లేదా?? అంటూ న‌ట‌కిరీటిపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించ‌డానికి కొంత‌మంది న‌టీన‌టులు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ త‌న దైవం అని చెప్పుకొనే రాజేంద్ర‌ప్ర‌సాద్‌... ఆయ‌న వార‌సుల్ని మ‌ర్చిపోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని కొంత‌మంది సెటైర్లు వేస్తున్నారు. మ‌రి వీటిని న‌ట‌కిరీటి ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.