English | Telugu

దిల్‌రాజు ఇక క‌నిపించ‌డా?

చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా - కొత్త హీరో అయినా, స్టార్ హీరో అయినా.. కంట్రోల్ చేసి, వాళ్ల స్టామినాకి త‌న బుర్ర‌ని వాడుకొంటూ అద్భుతాలు సృష్టించే స‌త్తా ఉన్న ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు. తెలివైన‌, బుర్రున్న ఈనాటి ప్రొడ్యూస‌ర్ ఎవ‌రంటే.. దిల్‌రాజు పేరే చెబుతారంతా! అలాంటి దిల్‌రాజు ఇక మీడియాలో క‌నిపించే అవ‌కాశాలు... ఏ మాత్రం క‌నిపించ‌డం లేదు. దిల్‌రాజుని బాయ్‌కాట్ చేయాల‌ని ఛాన‌ళ్లు నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. మీడియాని కంట్రోల్ చేయాల‌న్న విష‌యంలో కొంత‌మంది నిర్మాత‌లు కొన్ని నిర్ణ‌యాలు తీసుకొన్నార‌ట‌. ఇక మీద‌ట కొన్ని ఛాన‌ళ్ల‌కు, కొన్ని వెబ్ సైట్ల‌కు మాత్ర‌మే ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాల‌ని, ఫుటేజ్ కూడా అన్ని ఛాన‌ళ్ల‌కూ ఇవ్వ‌కూడ‌ద‌ని దిల్‌రాజు ఆధ్వ‌ర్యంలో కొంత‌మంది నిర్మాత‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకొన్న‌ట్టు భోగ‌ట్టా. ఈ వివ‌క్ష‌త ప‌ట్ల టీవీ ఛాన‌ళ్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. మొత్తం ఈ త‌తంగానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న దిల్‌రాజునీ, ఆయ‌న సినిమాల్నీ బాయ్‌కాట్ చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నాయ‌ట‌. అందులో భాగంగానే ఓ ప్ర‌ముఖ దిన ప‌త్రిక చిత్ర‌సీమ‌పై ప్ర‌తి రోజూ కొన్ని క‌థ‌నాల్ని ప్ర‌చురితం చేస్తోంద‌ని స‌మాచారం. ఎప్పుడూ స‌మీక్ష‌ల జోలికి వెళ్ల‌ని ఆ ప‌త్రిక‌... ఇటీవ‌ల విడుద‌లైన దిల్‌రాజు సినిమానిపై కూడా నెగిటీవ్‌ రివ్యూ ఇచ్చింది. ఈ వ్య‌వ‌హారం ఇంకా ఇలానే ముదిరితే.. దిల్‌రాజు బొమ్మ ఎక్క‌డా క‌నిపించ‌దు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.