English | Telugu

లారెన్స్ మంచి మనసుకి మరో ఉదాహరణ.. శ్వేత జీవితంలో వెలుగులు    

దక్షిణ భారతీయ సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు 'రాఘవ లారెన్స్'(Raghava Lawrence). సుదీర్ఘ కాలం నుంచి నృత్య దర్శకుడుగా, దర్శకుడిగా, నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా తనదైన శైలిలో దూసుకుపోతు ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. 2023 లో 'కార్తీక్ సుబ్బరాజ్'(Karthik Subbaraj)దర్శకత్వంలో 'జిగర్తాండ' కి సీక్వెల్ గా తెరకెక్కిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోకపోవడంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో చేస్తున్నాడు.

లారెన్స్ సామాజిక సేవలోను ముందుకు వరుసలో ఉంటు ఎంతో మందిని ఆదుకుంటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే పేదరాలైన 'శ్వేత'(Swetha)అనే దివ్యాంగురాలు అనారోగ్య సమస్యలతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైపోయింది. అసలు ఒక అడుగు కూడా ముందుకు వెయ్యడం లేదు. ఈ విషయం లారెన్స్ దృష్టికి రావడంతో శ్వేతకి ఒక స్కూటీని బహుమతిగా అందించడంతో పాటు, నడిచేందుకు సపోర్ట్ గా కృత్రిమ కాలుని ఏర్పాటు ఏర్పాటు చేయించాడు. శ్వేత పూరిపాకలో నివసిస్తుండటంతో సొంతిల్లు కట్టించాలని కూడా లారెన్స్ నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన శ్వేత, లారెన్స్ ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లారెన్స్ మరోసారి తన మంచి మనస్సు చాటి చెప్పారని పలువురు నెటిజన్స్ అభినందిస్తున్నారు

2005 లో లారెన్స్ తన పేరుపై 'లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి ఎంతో మంది అనాధల్ని, పేద వాళ్ళని పలు రూపాల్లో ఆదుకుంటు వస్తున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సాయం చేస్తుండంతో పాటు, స్కాలర్ షిప్స్ కూడా ఇస్తూ ప్రోత్సహించే లారెన్స్ ఇప్పటి వరకు నూట యాభై మంది పిల్లలకి గుండె సంబంధిత వ్యాధులకి ఆపరేషన్ కూడా చేయించాడు. బెంజ్, కాల భైరవ, బుల్లెట్, కాంచన 4 , హంటర్ అనే పలు క్రేజీ టైటిల్స్ తో కూడిన చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.