English | Telugu

మెగాస్టార్ కొత్త మూవీ ఓటీటీ అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'మన శంకర వరప్రసాద్ గారు' ముందుగా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా నాలుగు నెలలు సమయముండగా.. అప్పుడే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ని లాక్ చేసుకోవడం విశేషం. (Megastar Chiranjeevi)

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడంతో.. ప్రకటనతోనే 'మన శంకర వరప్రసాద్ గారు'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా, 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రావిపూడి నుంచి వస్తున్న సినిమా కావడంతో.. బిజినెస్ పరంగానూ అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ పరంగానూ భారీ ఆఫర్స్ వస్తాయి అనడంలో డౌట్ లేదు. (Mana Shankara Varaprasad Garu)

షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు'లో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో మెరవనుండటం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. నవంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేయాలని మూవీ టీం టార్గెట్ గా పెట్టుకుంది.