English | Telugu

లారెన్స్ మొహం చూపించ‌లేక‌పోతున్నాడా??


రెబ‌ల్‌తో భారీ ఫ్లాప్ మూట‌గ‌ట్టుకొన్నాడు లారెన్స్‌. ఫ్లాప్ ఒక్క‌టేనా అంటే కాదు కూడా. ఈ సినిమాతో తెలుగునాట లారెన్స్ ప‌రువు పోయింది. త‌మ‌ని ద‌ర్శ‌కుడు మోసం చేశాడ‌ని రెబ‌ల్ నిర్మాత‌లు లారెన్స్‌పై అభియోగాలు మోపారు. న‌ష్ట‌ప‌రిహారం డిమాండ్ చేశారు. దాంతో తెలుగునాట‌... లారెన్స్ ప‌రువు కాస్త గంగ‌లో క‌ల‌సిపోయింది. అందుకే తాను తీస్తున్న `గంగ‌` సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం కూడా హైద‌రాబాద్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ అడుగు పెట్ట‌లేదు లారెన్స్‌. ముని, కాంచ‌న సినిమాల‌తో హిట్లు కొట్టిన లారెన్స్ అదే.. త‌ర‌హాలో గంగ సినిమాని తెర‌కెక్కించాడు. ఈనెల 17న విడుద‌ల చేస్తున్నాడు కూడా. అయితే ప్ర‌మోష‌న్లు మాత్రం మొద‌లెట్ట‌లేదు. త‌మిళ‌నాట మాత్రం కాస్తో కూస్తో ప్ర‌చారం చేసుకొంటూ... తెలుగు వెర్ష‌న్ ని మాత్రం వ‌దిలేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నీసం ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ కూడా నిర్వ‌హించ‌లేదంటే ప‌రిస్థితి అర్థం అవుతోంది. సినిమాకి ఇంకా నాలుగు రోజుల స‌మ‌యం కూడా లేదు. ఇప్పుడు ప‌బ్లిసిటీ మొద‌లెట్టినా ప్ర‌యోజ‌నం లేదు. రెబ‌ల్ దెబ్బ‌తో తెలుగు ప్రేక్ష‌కులకు మొహం చూపించ‌లేక‌పోతున్నాడా? లేదంటే... త‌న సినిమాపై మితిమీరిన న‌మ్మ‌క‌మా..?? లేదంటే ఈ సినిమాపై ఆశ‌లు వ‌దిలేసుకొన్నాడా..? ప‌బ్లిసిటీకి ఖ‌ర్చు పెట్టినా వేస్టే అనుకొంటున్నాడా? ఏమో మ‌రి.. లారెన్స్ మ‌న‌సులో ఏముందో..?? కాక‌పోతే రెబ‌ల్ దెబ్బ లారెన్స్‌కి గ‌ట్టిగా త‌గిలింద‌న్న‌ది మాత్రం వాస్త‌వం. మ‌రి అందులోంచి ఎప్పుడు తేరుకొంటాడో..?

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...