English | Telugu
ఆదాశర్మ ముందే కూసింది....
Updated : Nov 13, 2014
లేడీ ఓరియెంటెడ్ పాత్రలంటే కథానాయికలకు ఎంత మక్కువో. ఒక్కసారైనా సినిమా అంతా తమ భుజాలపై వేసుకొని లాగించేయాలని ముచ్చటపడిపోతుంటారు. అయితే.. హీరోయిన్ గా, గ్లామర్ తారగా నిరూపించుకొన్నాకే - ఆ తరహా క్యారెక్టర్లు వస్తుంటాయి. కానీ ఆదాశర్మకి ఈ అవకాశం కాస్త ముందే వచ్చింది. హార్ట్ ఎటాక్ సినిమాతో ఆకట్టుకొంది ఆదా. ఇప్పుడు బన్నీ - త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. ఆ తరవాత ఆదాకి ఓ పెద్ద నిర్మాణ సంస్థ నుంచి పిలుపు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా వరించింది. పీవీపీ సంస్థ ఆదాశర్మతో ఓ సినిమా తెరకెక్కిస్తోంది. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఇప్పటికే ఆదాతో సంప్రదింపులు జరిపి, సంతకాలు కూడా పెట్టించేసుకొంది. గ్లామర్ పాత్రలు చేయాల్సిన ఏజ్‌లో లేడీ ఓరియెంటెడ్ పాత్రలేంటి?? అని ఆలోచించకుండా అడిగిన వెంటనే ఒప్పేసుకొంది ఆదాశర్మ. త్రివిక్రమ్ సినిమా షెడ్యూల్ పూర్తవ్వగానే పీవీపీ సినిమా మొదలైపోతుంది. మరి దర్శకుడు ఎవరు?? ఆదాశర్మ పాత్రేంటి?? అనే విషయాలు త్వరలో తెలుస్తాయి. అన్నట్టు ఈసినిమాని తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేస్తారట.