English | Telugu

సెకండాఫ్ సంగ‌తేంటి పూరీ?!

చిరంజీవి 150 వ‌సినిమా విష‌యంలో అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటు చేసుకొంటున్నాయి. గ‌త రెండేళ్ల నుంచీ.. చిరు సినిమా అటూ ఇటు చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. ముందు కృష్ణ‌వంశీని అనుకొన్నారు. ఆ త‌ర‌వాత మెగా కుటుంబానికి అత్యంత ఆప్తుడు వినాయ‌క్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. చివ‌రికి పూరి జ‌గ‌న్నాథ్ ద‌గ్గ‌ర ఆగింది. అయితే.. `మ‌ళ్లీ ఈ సినిమాని వినాయ‌క్ టేక‌ప్ చేస్తున్నార‌హో` అనే వార్త‌లొచ్చాయి. చిరంజీవి వినాయ‌క్‌ని పిలిపించుకొని త‌న 150వ సినిమా గురించి సుదీర్ఘ మంత‌నాలు జ‌రిపార‌ని, ఆ సంగ‌తి పూరికి తెల‌సి బాగా డిస్ట్ర‌బ్ అయ్యాడ‌న్న గుస‌గుస‌లు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ సినిమా పూరి చేతి నుంచి జారిపోతోందా? అనే సందేహాలూ వ్య‌క్త‌మ‌య్యాయి.

అయితే పూరి హ‌డావుడిగా `అన్న‌య్య‌కు ఫ‌స్టాఫ్ చెప్పేశా. చాలా థ్రిల్ ఫీల‌య్యారు. సెకండాఫ్ కోసం మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డ‌తా` అంటూ చిరు అభిమానుల్ని ఖుషీ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఆటోజానీ ఫ‌స్టాఫ్ చిరుకి పూరి ఎప్పుడో చెప్పేశాడు. అందులో కొత్త న్యూసేం లేదు. చిరు కి ఫస్టాప్ కూడా కూడా న‌చ్చింది. అయితే సెకండాఫ్ ద‌గ్గ‌రే స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ఫ‌స్టాఫ్ ఉన్న రేంజులో సెకండాఫ్ లేద‌ని చిరు ఫీలింగ్‌. అందుకే రెండు నెల‌ల క్రిత‌మే `సెకండాఫ్ పై దృష్టి పెట్టు. తొంద‌ర‌గా రాయ్‌` అంటూ చిరు పూరికి సూచించాడ‌ట‌.

అప్ప‌టి నుంచీ పూరి సెకండాఫ్‌పైనే కూర్చున్నాడు. ఎన్ని వెర్షన్లు రాసినా.. చిరు అంచ‌నాల‌కు ద‌గ్గ‌ర‌కాలేక‌పోతున్నాడ‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అందుకే వెంట‌నే వినాయ‌క్‌తో చిరు మీటింగ్ పెట్టాడ‌ని తెలుస్తోంది. పూరికి చిరు రెండు వారాల స‌మ‌యం ఇచ్చాడ‌ని, ఈలోగా పూరి సెకండాఫ్ కంప్లీట్ చేసి వినిపించాల‌ని, లేదంటే ఈ సినిమా వినాయ‌క్ చేతిలో పెట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి సెకండాఫ్‌ని పూరి ఎప్పుడు ఫినిష్ చేస్తాడో, ఎప్పుడుఈ సినిమా కొబ్బ‌రికాయ్ కొట్టుకొంటుందో.??