English | Telugu

ఎన్టీఆర్ కోసం జగన్ మాస్టర్ ప్లాన్..!

'ఆంధ్రావాలా' అట్టర్‌ఫ్లాప్‌ తరువాతఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రాలేదు. ఆ సినిమా వచ్చిన ఇన్నేళ్లలో ఈ కాంబినేషన్‌లో ఎన్నోసార్లు ఇద్దరూ ప్రయత్నించినా కానీ రెండో సినిమా వర్కవుట్‌ కాలేదు. ఎట్టకేలకు ఈ కాంబినేషన్‌లో మూవీ వస్తోంది. 'ఆంధ్రావాలా' చిత్ర పరాజయానికి ప్రాయశ్చిత్తంగా మరో సినిమాతో హిట్ ఇస్తానని పూరి అప్పుడే ఎన్టీఆర్‌కి మాటిచ్చాడు. దాని కోసం పూరి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడట. ఈ మధ్య తాను రాసిన కథలతో చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయేసరికి..ఇప్పుడు బయట కథతో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు పూరి. అలాగే స్క్రిప్ట్ లోని ప్రతి అంశంపైన చాలా శ్రద్ద తీసుకొని మరి రెడీ చేస్తున్నాడట. కమర్షియల్ లెక్కలు వేయడంలో పూరి చాలా సిద్దహస్తుడు. అందుకే ఈసారి ఎన్టీఆర్ తో బాక్స్ ఆఫీస్ నూ కుమ్మెయించడానికి ముందును౦చే రంగం సిద్దం చేస్తున్నాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.