English | Telugu

'జెండాపై కపిరాజు' ఎప్పుడూ వస్తాడో!

వాయిదాలు పడుతూ వస్తున్న 'జెండాపై కపిరాజు' మరోసారి వాయిదా పడింది. 'నాని'..'అమలాపాల్' నటించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఆ మధ్య ఆగస్టు ఎనిమిదిన రిలీజ్ చేస్తున్నామని చెప్పిన టీమ్..తాజాగా మరోసారి పోస్ట్ పోన్ చేశారు. ఈ డీటైల్స్ తెలుపుతూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ''తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. సమాజానికి సందేశాన్నిచ్చే ఇలాంటి చిత్రంలో పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమాలో మూడు నిమిషాలు ఉండే పోరాట సన్నివేశాన్ని 24 రోజులు చిత్రీకరించాం. ఇప్పుడు దాన్ని తెరపై చూసుకుంటే ఆ కష్టమంతా మరచిపోయాను'' అని నాని చెప్పారు.త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత తెలిపారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.