English | Telugu

చిరంజీవికి పూరి జగన్నాధ్ అభిమానే కాదు.. ఈ పిక్ చూస్తే మీరు కూడా ఇదే మాట చెప్తారు 

దర్శకుడుగా 'పూరిజగన్నాధ్'(Puri Jagannadh)ఇప్పుడు కొంచం స్లో అయ్యాడు. కానీ విజయాలు అందుకోవడం మాత్రం కొత్తేమీ కాదు. తెలుగు సిల్వర్ స్క్రీన్ కి కొత్త రకం కథ, కథనాల్ని పరిచయం చేసిన వాళ్ళల్లో కూడా ఒకడు. మెగాస్టార్ చిరంజీవికి పూరి జగన్నాధ్ అభిమాని.ఈ విషయాన్నీ తనే చాలా సందర్భాల్లో బహిరంగంగానే వెల్లడి చేసాడు. కానీ రీసెంట్ గా షేర్ చేసిన పిక్ తో చిరంజీవికి వీరాభిమాని అని అర్థమవుతుంది.

పూరి జగన్నాధ్ సోషల్ మీడియా వేదికగా 'పూరి మ్యూజింగ్స్' ని నిర్వహిస్తు,పలు అంశాలపై నెటిజెన్స్ కి అవగాహన కల్పిస్తూ ఉంటాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాటిని కూడా వెల్లడి చేసే పూరి జగన్నాధ్ రీసెంట్ గా ఒక పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ లో 'నా పాత డైరీ దొరికింది. ఖైదీ సినిమా రిలీజ్ రోజున ఒక అభిమాని తన స్వహస్తాలతో చిరంజీవి గారి చిత్రం గీసి థియేటర్ దగ్గర ఫోటోకార్డు డిస్ ప్లే లో ఉంచిన 60 / 40 ఫోటో దొరికింది. ఆ అభిమాని పేరు పూరి జగన్నాధ్ అంటు సదరు డైరీ ని, అందులో ఉన్న చిరంజీవి పిక్ ని కూడా షేర్ చేసాడు. ఖైదీ క్లైమాక్స్ సన్నివేశాల్లో చిరంజీవి బ్లాక్ డ్రెస్ లో, తలకి రిబ్బన్ కట్టుకొని ఉన్న స్టిల్ అది. 1983 లో వచ్చిన ఖైదీ చిరంజీవిని ఓవర్ నైట్ స్టార్ ని చెయ్యడమే కాకుండా, పూరి జగన్నాధ్ లాంటి ఎంతో మందిని అభిమానులుగా చేసింది.

ఇక పూరి జగన్నాధ్ ఎప్పట్నుంచో చిరంజీవితో సినిమా చేయలని అనుకుంటున్నాడు. ఒక రకంగా ఆయన డ్రీం అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా 'ఆటోజానీ' అనే స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నాడు. చిరంజీవి నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రావడం లేదు.మరి భవిష్యత్తులో చేస్తాడేమో చూడాలి. కాకపోతే చిరంజీవితో నటుడుగా 'గాడ్ ఫాదర్' మూవీలో సొసైటీ మీద బాధ్యత కలిగిన జర్నలిస్ట్ గా పూరి జగన్నాధ్ నటించడం జరిగింది. ఆ ఇద్దరి కాంబోలోని సీన్స్ కి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ప్రస్తుతం మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి తో తన కొత్త చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.