English | Telugu

ఓజీ సినిమా వెనుక ఆ ఇద్దరు.. పవన్ కళ్యాణ్ కోసమే ఇదంతా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'ఓజీ' (OG) మూవీ తాజాగా థియేటర్లలో అడుగుపెట్టి.. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ కి, ఎలివేషన్స్ కి థియేటర్లలో ఫ్యాన్స్ 'ఓజీ ఓజీ' అంటూ ఊగిపోతున్నారు. అయితే ఈ సినిమాకి 'ఓజీ' అనే టైటిల్ పెట్టడం వెనుక ప్రముఖ నిర్మాత నాగవంశీ ఉన్నారు. ఈ విషయాన్ని ఓజీ నిర్మాత డీవీవీ దానయ్య స్వయంగా చెప్పడం విశేషం. (They Call Him OG)

ఓజీ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానులు, యాక్షన్ ప్రియులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్.. సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా డీవీవీ దానయ్య మాట్లాడుతూ.. ఇద్దరికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఆ ఇద్దరిలో ఒకరు త్రివిక్రమ్ కాగా, మరొకరు నాగవంశీ.

"నేను మొట్ట మొదటిగా థాంక్స్ చెప్పాల్సింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు.. దర్శకుడు సుజీత్ పేరు త్రివిక్రమ్ గారే సూచించారు. త్రివిక్రమ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు, నాకు ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు." అంటూ త్రివిక్రమ్ వల్లే సుజీత్ ని కలిసి ఈ ప్రాజెక్ట్ చేసినట్లు దానయ్య తెలిపారు.

అలాగే నాగవంశీ గురించి మాట్లాడుతూ.. "నాగవంశీ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. నిజానికి ఓజీ అనే టైటిల్ ను ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, మా కోసం ఆ టైటిల్ ఇచ్చేశారు. ఓజీ టైటిల్ సినిమాకి ఎంతో హెల్ప్ అయింది." అని దానయ్య చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కి, నాగవంశీకి మంచి అనుబంధం ఉంది. పవన్-సుజీత్ కాంబినేషన్ లో సినిమాకి త్రివిక్రమ్ బీజం పడేలా చేస్తే.. ఆ కాంబో కోసం తాను రిజిస్టర్ చేసుకున్న 'ఓజీ' టైటిల్ ని నాగవంశీ ఇచ్చేయడం విశేషం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.