English | Telugu
రూ.5 కోట్ల పారితోషికంతో ఛార్మి సంచలనం!
Updated : Jun 9, 2015
తెలివంటే ఛార్మిదే. పైసా పారితోషికం తీసుకోకుండా సినిమాలో యాక్ట్ చేసింది. నిర్మాత అనే హోదా అనుభవించింది. ఇప్పుడు ఆ సినిమాకి గానూ రూ.5 కోట్ల పారితోషికం అందుకొని ఓ సరికొత్త సంచలం సృష్టించింది. పూరి - ఛార్మిల కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న సినిమా జ్యోతిలక్ష్మి.
ఈసినిమాకి ఛార్మి పైసా పారితోషికం తీసుకోకుండా భాగస్వామిగా చేరిపోయింది. అటు పూరి కూడా ఫ్రీగానే చేశాడు. ఎందుకంటే ఈ సినిమాలో తనకూ వాటా ఉంది. ఈ సినిమాలో ఛార్మి తప్ప మరో స్టార్ ఎవరూ లేరు. అందుకే ఈ సినిమాని అతి తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేయగలిగాడు పూరి. ఇప్పుడు ఈ సినిమాని మొత్తంగా రూ.15 కోట్లకు అమ్మేశారట. అంటే ఛార్మి తన వాటాగా రూ.5 కోట్లు దక్కించుకొందన్నమాట.
ఈ ఉత్సాహంతో జ్యోతిలక్ష్మీ 2 కూడా చేసేయడానికి ఛార్మి రెడీ అయిపోతోంది. రూ.5 కోట్ల పారితోషికం వస్తే ఎవరు ఆగుతారు. కాకపోతే పూరినే ఖాళీగా లేడు. ఛార్మితో జ్యోతిలక్ష్మి 2 తీయాలంటే మూడేళ్లయినా పడుతుంది. పూరి అంత బిజీ మరి. అయితే జ్యోతిలక్ష్మితో అత్యధిక పారితోషికం అందుకొన్న కథానాయికగా ఛార్మి రికార్డ్ సృష్టించినట్టే. మిగిలిన హీరోయిన్లంతా ఈ ఫార్ములా పాటిస్తే... బాగుంటుందేమో.