English | Telugu

పూరీ తెలుగు "షోలే"లో గోపీచంద్, ప్రభాస్

హిందీలో అపూర్వ విజయం సాధించిన "షోలే" చిత్రాన్ని తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, గోపీచంద్, ప్రభాస్ లు హీరోలుగా నటిస్తూండగా రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఒకప్పుడు ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, అంజాద్ ఖాన్, హేమ మాలినీ, జయబాధురి వంటి హేమా హేమీలు నటించగా, రమేష్ సిప్పీ స్వీయ దర్శకత్వంలో నిర్మించగా చరిత్ర సృష్టించిన బాలీవుడ్ చిత్రం"షోలే".ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.ఈ సినిమా సంగీతం కూడా అద్భుత విజయం సాధించింది.హెలెన్ డ్యాన్స్ చేసిన "మెహబూబా మెహబూబా" అనే పాట చాలా పెద్ద హిట్టయ్యింది.ఆ స్థాయిలో దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోలు గోపీచంద్, ప్రభాస్ లు ఈ చిత్రాన్ని తెలుగులో రూపొందించగలరా...? కాలమేచెప్పాలి...!

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం