English | Telugu
అఖిల్ 'ఏజెంట్' ఓటీటీ వెర్షన్ లేనట్టే!
Updated : Jul 3, 2023
ఈమధ్య కాలంలో హిట్ సినిమాలు కూడా నాలుగు వారాలకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. అలాంటిది ఈ ఏడాది ఘోర పరాజయాల్లో ఒకటిగా నిలిచిన 'ఏజెంట్' మాత్రం ఎనిమిది వారాలైనా ఓటీటీలోకి రాలేదు. ఎప్పుడొస్తుందో కూడా క్లారిటీ లేదు. అయితే ఏజెంట్ సినిమాని రీ ఎడిట్ చేస్తున్నారని, ఓటీటీ కోసం ప్రత్యేక వెర్షన్ ని విడుదల చేయనున్నారని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను తాజాగా నిర్మాత అనిల్ సుంకర ఖండించారు.
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఏజెంట్'. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా మంచి అంచనాలతో ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలైంది. అయితే మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఈ మూవీ త్వరగానే ఓటీటీలోకి వస్తుందని భావించారంతా. ఆ తర్వాత ఓటీటీ వెర్షన్ కోసం రీ ఎడిట్ చేస్తున్నారని, అందుకే లేట్ అవుతుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా 'సామజవరగమన' సక్సెస్ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనిల్ సుంకర.. ఓటీటీ కోసం ఎలాంటి రీ ఎడిట్ చేయలేదని అన్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుందని, రిలీజ్ డేట్ పై వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఆయన మాటలను బట్టి చూస్తే థియేటర్ వెర్షన్ నే ఓటీటీలోనూ విడుదల చేయనున్నారని స్పష్టమైంది. అయితే స్ట్రీమింగ్ డేట్ పై మాత్రం క్లారిటీ రాలేదు.